మైనర్‌ బాలుడు ఆత్మహత్య

మైనర్‌ బాలుడు ఆత్మహత్య

ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ వ్యవహారం ఈ రెండింటినీ భరించలేక మైనర్‌ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెలుగు చూసింది. ఎస్‌ఐ మధుసూదన్‌ సమాచారం మేరకు… కింగ్‌ కోఠి పరదాగేట్‌లో నివాసం ఉంటున్న ఎం.డి.అంజాద్ఖాన్, రజ్వీయా సుల్తానా దంపతుల కుమారుడు ఎం.డి.అక్బర్‌ఖాన్‌ నగరంలో ఓ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తనకు చదువుపై ఆసక్తి లేదు.

ఇటీవల తన క్లాస్‌మేట్‌ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇలా ఓ వైపు చదువు మరో పక్క ప్రేమ వ్యవహారం అతన్ని మానిసికంగా కుంగదీశాయి. ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పలేక, ఎవరినీ బాధ పెట్టలేక సోమవారం అర్ధరాత్రి బెడ్‌రూంలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రజ్వీయా సుల్తానా ఎంత పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చి కిటికీ గ్రిల్స్‌ తొలగించి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపారు.