బాలికపై యువకుడు అత్యాచారం

బాలికపై యువకుడు అత్యాచారం

మండలంలోని యారాడ కొండపై ఓ బాలికపై యువకుడు బుధవారం రాత్రి అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి న్యూపోర్టు సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం… పెదగంట్యాడ మండలానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదవుతోంది. ఆ బాలికకు అదే ప్రాంతానికి చెందిన మద్ది గణేష్‌రెడ్డి తో పరిచయం ఏర్పడింది. పెదగంట్యాడలో బుధవారం జరిగిన ఓ పరస మహోత్సవానికి ఆ బాలిక తన అక్కతో కలిసి వెళ్లింది. కొద్దిసేపు పరసలో గడిపిన తర్వాత ఆ బాలిక అక్క అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఆ బాలిక తర్వాత గణేష్‌రెడ్డితో కలసి పరసలో గడిపింది. అక్కడి నుంచి యారాడ వెళ్దామని చెప్పి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గణేష్‌ తన మేనమామ గంగవరం గ్రామానికి చెందిన మైలపిల్లి రాజు అలియాస్‌ గిటార్‌ రాజుకు ఫోన్‌ చేసి రప్పించాడు.

అక్కడి నుంచి ముగ్గురూ యారాడ తీరానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తర్వాత ఆ ఇద్దరు యువకులు మద్యం సేవించారు. ఆ ఇద్దరిలో గణేష్‌ మద్యం మత్తులో నిద్రపోయాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న రాజు బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక కొండ పైనుంచి కిందకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని చెప్పడంతో న్యూపోర్టు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బాలిక త్రండి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ ఎస్‌.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు.