ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కొమురవెల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని శ్రీనివాస్, జ్యోతి దంపతుల కూతురు బత్తిని భార్గవి (16). పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
కాగా కొమురవెల్లి గ్రామానికి చెందిన కుర్ర మధు తనను ప్రేమించమని వెంట పడుతుండటంతో మనస్తాపానికి గురైన భార్గవి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొంది. మృతురాలి తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.