“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది!

“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది!
Movie News

మన టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అని అందరికి తెలిసిందే. మరి అనుష్క స్టార్ పవర్ ఉన్నప్పటికీ ఈ మూవీ లో హీరోగా నటించిన యంగ్ నటుడు నవీన్ పొలిశెట్టి ఈ మూవీ విజయంలో సినిమాని ప్రమోషన్స్ పరంగా ఆడియెన్స్ లోకి తాను ఒక్కడే తీసుకెళ్లాడు.

“మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది!
Miss Shetty Mr.Polishshetty

దీనితో ఇలా సినిమా మేకర్స్ అందరి కష్టానికి కూడా ఆడియెన్స్ మంచి ఫలితాన్ని అందించారు. దీనితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి విజయాన్ని సాధించగా ఇపుడు ఫైనల్ గా ఈ మూవీ ఓటిటి డేట్ అయితే వచ్చేసింది.

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇప్పుడు ఇందులో ఈ సినిమా ఈ అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్టుగా తాజాగా అనౌన్స్ చేసారు. మరి అప్పుడు మిస్ అయ్యిన వారికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు . ఇక ఈ మూవీ కి మహేష్ బాబు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.