రంగారెడ్డి ఎత్తిపోతలకు మోదీ జాతీయహోదా ఇవ్వాలి: మంత్రి కేటీఆర్

Modi should give national status to Ranga Reddy upliftment: Minister KTR
Modi should give national status to Ranga Reddy upliftment: Minister KTR

 

మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో రూ.1369కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా రూ.690 కోట్లతో మున్నేరు నదికి రెండు వైపులా నిర్మించనున్న RCC ప్రొటెక్షన్ వాల్ కు, నదిపై రూ.690 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం ఖమ్మం, సత్తుపల్లిలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాటు చేశారు అధికారులు. కాగా నిన్న కేటీఆర్ వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో పాల్గొని ప్ర‌సంగించారు. పాలమూరుకు వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల‌ను కేటాయించాల‌న్నారు. మోదీకి తెలంగాణ అంటే ఎందుకింత క‌క్ష అని ప్ర‌శ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు.