నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. హాసని అనే యువతి ఉరి వేసుకుంటున్నట్లు ఆన్లైన్లో వీడియో లైవ్ పోస్టు చేసింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు డైల్ హండ్రెడ్ కు సమాచారం ఇవ్వగా.. వెంటనే నారాయణగూడ పోలీసులు స్పందించారు. హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న తన ఫ్లాట్లోకి వెళ్లి యువతిని రక్షించి హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హాసిని 2018లో మిస్ తెలంగాణగా యువతి ఎంపికైంది.. ఇటీవలే ఓ యువకుడిపై శారీరకంగా వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.