వరుణ్ , రాహుల్ స్నేహానికి చిచ్చు పెట్టిన బిగ్ బాస్

వరుణ్ , రాహుల్ స్నేహానికి చిచ్చు పెట్టిన బిగ్ బాస్

నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా అత్తగా నటిస్తున్న శివజ్యోతికి ముగ్గురు కొడుకులు కోడళ్లు వరుణ్‌-వితిక, రవి-శ్రీముఖి, రాహుల్‌-పునర్నవిలను జంటలుగా విడగొట్టారు. వీరిలో ఏ జంట ఎక్కువ ఇటుకలతో గోడ నిర్మిస్తే వారు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులన్న విషయం తెలిసిందే. వీరితో పాటు వీలునామా చేజిక్కించుకున్న వారు కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతారు. అయితే ఇటుకలను సంపాదించడానికి వితిక, శ్రీముఖి.. శివజ్యోతిని బాగానే కాకా పట్టారు. వితిక అత్తను అందంగా ముస్తాబు చేయడం, శ్రీముఖి శివజ్యోతికి గోరుముద్దలు తినిపించడం.. ఇలా అడగకముందే కోడళ్లు అన్ని సపర్యలు చేస్తూ అత్తను బుట్టలో వేసుకోడానికి ప్రయత్నించారు.

టాస్క్‌లో భాగంగా రాహుల్‌. వరుణ్ దగ్గర ఇటుకలు కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఎన్ని ఇటుకలు సంపాదించుకున్నాం అనేదానికన్నా ఎన్ని లాక్కున్నాం అనేదానిపైనే రాహుల్‌ ప్రధానంగా దృష్టి సారించాడు. దీంతో ఇటుకలు పట్టుకొస్తున్న వరుణ్‌ను కట్టడి చేసి అతని దగ్గర నుంచి ఇటుకలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాహుల్‌, వరుణ్‌, వీరిద్దరినీ ఆపేందుకు ప్రయత్నించిన వితికకు గాయాలయ్యాయి.

దీంతో వారిమధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కూల్‌గా ఉండే వరుణ్‌ సహనాన్ని కోల్పోయాడు. ఏంటి? కొడతావా అంటూ రాహుల్‌పై సీరియస్‌ అయ్యాడు. గతంలో జరిగిన వాటిని తవ్వి తీస్తూ.. ‘అలీ చేసిన తప్పే నువ్వూ చేస్తున్నావని, హిమజ విషయంలోనూ ఏం జరిగిందో అందరూ చూశారు’ అని రాహుల్‌ను తప్పుబట్టాడు. తాను ఏ తప్పూ చేయలేదంటూ రాహుల్‌ కూడా గొడవకు దిగాడు.ఇక దొరికిందే సందని అన్నట్టు శ్రీముఖి.. వరుణ్‌ దగ్గరకు వెళ్లి రాహుల్ గురించి నెగెటివ్‌గా చెప్పింది. అప్పటివరకు సరదాగా సాగిన టాస్క్‌.. వీరి గొడవలతో హీటెక్కింది.