నెటిజెన్ పై కౌంటర్ వేసిన మిథాలీ

నెటిజెన్ పై కౌంటర్ వేసిన మిథాలీ

మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్ ని ట్రోల్ చేయాలని భావించిన నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాదనం సోషల్ మీడియాలో ఇచ్చింది. మిథాలీ కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకోవాడమే కాకుండా దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను గెలిచింది.

మిథాలీ రాజ్‌ని, సచిన్‌ టెండూల్కర్‌ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. క్రికెట్‌ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ మెచ్చుకోవడం ఆనందదాయకం అని మిథాలీ రాజ్‌ రీట్వీట్‌ చేసింది. మిథాలీ ట్వీట్‌పై సుగు అనే ఓ నెటిజన్‌ మాతృభాష తమిళం అయినప్పటికీ మిథాలీ ఎప్పుడూ తమిళం మాట్లాడకుండా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాషల్లోనే మాట్లాడుతుందని ట్వీట్ చేసింది.

నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వంగా ఉంది… ముఖ్యంగా భారతీయురాలు గా గర్విస్తున్న అని కౌంటర్‌ ఇచ్చింది మిథాలీ రాజ్.