మరో ఎమ్మెల్యే కి కరోనా వైరస్

మరో ఎమ్మెల్యే కి కరోనా వైరస్

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్కరినీ కూడా ఈ వైరస్ విడిచి పెట్టడం లేదు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం ఒక వేడుక లో పాల్గొన్నారు. అయితే అక్కడ వేడుక లోనే కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కొగా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కి కరోనా వైరస్ సోకడం తో హైదరాబాద్ లోనే తన నివాసం లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా సంజయ్ కుమార్ ను కలిసిన వారు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కొనేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవల కలిసిన అందరూ కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని, స్వీయ నిర్బంధం లో ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.