నాన్నా పులి కథ… మారిన రోజా వ్యధ.

MLA Roja Silent in front of Media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ తరం వాళ్లకి తెలుసో, లేదో కానీ అప్పట్లో తెలుగు మీడియం చదువుకున్న పిల్లలందరికీ తెలిసిన కథ ఒకటుంది. అదే… నాన్నా పులి కథ. అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడితే ఆ తర్వాత నిజం చెప్పినా ఎవరూ నమ్మరని చెప్పేందుకు పెద్దలు ఎప్పుడో ఈ కథ అల్లారు. ఆ కథ కి ఇప్పుడు వైసీపీ నాయకురాలు వ్యధకి సంబంధం తెలుసుకునే ముందు ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

Naanna Puli Katha

ఓ తండ్రీకొడుకులు గొర్రెలు, మేకల మంద మేపుకోడానికి దగ్గర్లోని అడవికికి వెళతారు. కొంతసేపటి తర్వాత అలసిపోయిన తండ్రి కొద్ది సేపు ఓ చెట్టు కింద సేద తీరుతా అని కొడుకు కి చెప్పి వెళతాడు. ఏదైనా అవసరం అయితే పిలవమని చెబుతాడు. తండ్రి మాగన్నుగా నిద్రపోయాడో లేదో ఆ పిల్లవాడు నాన్నా పులి అని అరవడం మొదలు పెట్టాడు. వెంటనే లేచి ఆ తండ్రి పరిగెత్తుకు వెళ్ళాడు. ఈ తండ్రి వెళ్లేసరికి ఆ కొడుకు నవ్వుతూ కనిపించాడు. అక్కడ పులి లేదు. ఏమీ లేదు. ఏదో సరదాకి పిల్లవాడు అలా అరిచాడని గ్రహించిన ఆ తండ్రి అలా చేయకూడదని సుద్దులు చెప్పి వచ్చాడు. కాసేపటికి మళ్లీ ఆ కొడుకు అలాగే అరిచాడు. ఈసారి అక్కడికి వెళ్లిన తండ్రికి అక్కడ ఏమీ లేకపోవడంతో బాగా కోపం వచ్చింది. అతన్ని మందలించి వచ్చాడు. ఈసారి నిజంగానే పులి వచ్చింది. ఆ పిల్లవాడు అరిచాడు. ఆ తండ్రి పిల్లవాడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు. వచ్చిన పులి గొర్రెలు, మేకల మంద మీద దాడి చేసి వెళ్ళిపోయింది.

ఇప్పుడు ఇలాగే అయ్యింది తాను మారాను అని చెబుతున్న వైసీపీ నాయకురాలు రోజా పరిస్థితి. నిన్నమొన్నటిదాకా అంటే నంద్యాల ఫలితం వచ్చేదాకా ఆమె నోటి దూకుడుకు అంతు లేదు. ప్రత్యర్థి పార్టీ సంగతి పక్కనబెట్టి సొంత పార్టీ వాళ్ళే ఆమె నోటి దురుసు వల్ల వచ్చే ఓట్లు పోతున్నాయని జగన్ ముందు వాపోయారు. పరిస్థితి అర్ధం చేసుకున్న రోజా సోషల్ మీడియాలో జగన్ భజన చేసి సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఒకటిరెండు సందర్భాల్లో బయటికి వచ్చినా రాజకీయాల గురించి మాట్లాడకుండా జాగ్రత్తపడ్డారు. అయినా ఆమె దగ్గరికి వచ్చే వారికి ఈ కొత్త ధోరణి అర్ధం కాకుండా ఉందట. ఇక పార్టీ పెద్దలు కూడా ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఆమె చెప్పిన మాటలు నమ్మడం లేదట. ఇదే అదనుగా ప్రత్యర్థి పార్టీ నేతలు ఆమెతో మాటలు ఈటెలుగా ఓ ఆట ఆడుకుంటున్నారు. రోజాకి కూడా ఆ ఆట తెలుసు. కానీ సొంత పార్టీ ఆమె చేతులు కట్టేసింది. నోరు కుట్టేసింది. ఇక ఈ శిక్ష నుంచి రోజాకి విముక్తి ఎప్పుడో ? ఆమె మాట బయటికి వినపడేదెన్నడో ?.