ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పై ఇప్పటికే టిడిపి నేతలు పలు మార్లు విమర్శలు చేస్తున్నారు. జగన్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన లో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు అని కరణం బలరాం అన్నారు. అయితే జగన్ పని తీరుకి టిడిపి ఎమ్మెల్యే లు అంతా ఆకర్షితులు అవుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కారణం తో టిడిపి లో ఉన్నటువంటి ఎమ్మెల్యే లు ఎంతమంది బయటికి వస్తారు అని ఇపుడే చెప్పలేం అంటూ బాంబ్ పేల్చారు.చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నపుడు ప్రజలను నిర్లక్ష్యం చేశారు అని ఆరోపించారు.
అయితే చంద్రబాబు నాయుడు పై టిడిపి ఎమ్మెల్యే లకు నమ్మకం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క జగన్ పాలన విధానం పై ప్రశంసలు కురిపిస్తూనే, చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పోకడకు, జగన్ వ్యవహార శైలి కి చాలా తేడా ఉంది అని అన్నారు. వెలిగొండ విషయంలో చంద్రబాబు ప్రజలను నిర్లక్ష్యం చేశారు అని ఆరోపించారు. బాబు ప్రజల కోసం చిత్త శుద్ది తో పని చేయలేదు అని అన్నారు.అయితే జగన్ ఏడాది పాలన పై ప్రశంసలు కురిపించారు. అలానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై అభినందనలు తెలిపారు.