ఈ రోజుల్లో కొందరు తొందరపడి క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే ఓ 17 ఏళ్ల ఎమ్మెల్యే కుమారుడు తన తండ్రి లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ యాదవ్ గురువారం మధ్యాహ్నం 4 గంటలకు గోరఖ్‌పూర్ ప్రాంతంలోని వారి ఇంట్లో తన తండ్రి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి హూటా హుటిన తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజయ్ యాదవ్ జబల్‌పూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న బార్గి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో రాసినట్లు ఎస్పీ తెలిపారు.