హోరాహోరీగా తెలంగాణలో ఎన్నిక..

MLC Elections in Telangana

తెలంగాణలో మూడు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూలేని విధంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుండటంతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుండగా అందరి దృష్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల స్థానంపై నెలకొంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా పనిచేసింది. కాంగ్రెస్ తరపున ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారనేది ఆసక్తిగా మారింది.