మోడీ సంచలనం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ !

మ‌ధ్య‌ త‌ర‌గ‌తి ఓటు వ‌ల్ల గ‌త ఎన్నికల్లో ప్ర‌ధాని పీఠం ఎక్కినా న‌రేంద్ర మోడీ క్రమక్రంగా ఆ వ‌ర్గంలో విశ్వ‌స‌నీయ‌త కోల్పోయారు. 2014 ఎన్నిక‌ల ముందు మోడీ ఈ దేశాన్ని కాపాడ‌టానికి వ‌చ్చిన ఒక శ‌క్తిగా జ‌నం న‌మ్మ‌డం వ‌ల్ల ఈరోజు మోడీ మ‌రింత భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన చెప్పినట్టు బ్లాక్ మ‌నీ విష‌యంలో దేశాన్ని మారుస్తార‌ని న‌మ్మారు. ఇవ‌న్నీ నెర‌వేర్చ‌క‌పోగా నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి వాటి వ‌ల్ల ఆయన అస‌మ‌ర్థ ప్ర‌ధానిగా ప్ర‌జ‌ల్లో ముద్ర వేయించుకున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి దాదాపు ఖాయ‌మైపోయిన పరిస్థితి. ఇలాంటి నేప‌థ్యంలో ఎలాగైనా దీని నుంచి బ‌య‌ట‌ప‌డటానికి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని మోడీ నిశ్చ‌యించుక‌న్నార‌ట. అందులో భాగంగా పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసి అంద‌రి మ‌న‌సు గెల‌వాల‌ని ట్రై చేస్తున్నాడు. తాజాగా త‌ను విశ్వాసం కోల్పోయిన అగ్ర‌వ‌ర్ణాల‌ను సంతోష‌ప‌రిచే నిర్ణ‌యం ఒక‌టి ఈరోజు తీసుకున్నారు.

మోడీ సంచలనం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ! - Telugu Bullet

అగ్ర వర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేబినెట్‌ లో మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన సవరణ బిల్లును రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెడ‌తారు. రెండు సభల్లో ఆమోదం పొందిన తర్వాత బిల్లు రాష్ట్రాపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ రాష్ట్రపతి ముద్ర పడాలి. అపుడు ఇది చట్టంగా రూపొందుతుంది. ఎన్నిక‌లు ముందు చట్టం అయిపోతే మోడీతో ప‌నేముంది. కానీ రాజ్య‌స‌భ‌లో ఆపితే అధికారం ఇస్తేనే రిజ‌ర్వేష‌న్లు అని మెలికి పెట్టే అవ‌కాశ‌మూ ఉంటుంది. ఇది బ‌హిరంగంగా ప్ర‌క‌టించిక‌పోయినా జ‌నాల‌కు అర్థ‌మ‌వుతుంది.అయితే, రాజ్యాంగం ప్ర‌కారం 50 శాతం రిజ‌ర్వేష‌న్లు మించ‌కూడ‌దు. ఆ లెక్క‌న అయితే అగ్ర‌వ‌ర్ణాల‌కు అవ‌కాశం రాదు. అందుకే ఈ నిర్ణ‌యం చ‌ట్టంగా మారాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాలి. దాని ప్రకారం ఇప్పుడు 60 శాతానికి రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయనున్నారు.