లాక్ డౌన్ గురించి స్పష్టత ఇచ్చిన మోడీ

లాక్ డౌన్ గురించి స్పష్టత ఇచ్చిన మోడీ

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్‌ను స‌డ‌లించేశారు. అన్ లాక్ పేరుతో థియేట‌ర్లు, జిమ్‌లు లాంటివి మిన‌హా అన్నీ తెరిచేశారు. మాల్స్, ఆల‌యాలు.. అన్ని ర‌కాల దుకాణాలూ ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటే క‌రోనా కేసులు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో ఇండియా పీక్స్‌ను చూస్తోందిప్పుడు. ఒక్క రోజుల రెండు వేల‌కు పైగా మ‌ర‌ణాలంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్ట‌క త‌ప్ప‌ద‌ని.. కేంద్రం ఈ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఆలోచిస్తోంద‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌వ‌చ్చ‌ని ఒక ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతోంది. కొంద‌రైతే వ‌రుస‌గా మూణ్నెల్ల పాటు లాక్ డౌన్ పెట్ట‌బోతున్నార‌ని కూడా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇలాంటి ప్ర‌చారానికి తెర‌దించుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని.. అన్ని రాష్ట్రాల సీఎంల‌తో బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ మ‌ళ్లీ విధించే అవ‌కాశాలు ఎంత‌మాత్రం లేవ‌ని.. ఈ విష‌య‌మై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సీఎంల‌ను కోరారు ప్ర‌ధాని. దేశంలో మ‌ళ్లీ లాక్ డౌన్ విధిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రితో మీడియాతో మాట్లాడ‌తారు అన‌గానే మ‌ళ్లీ లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అనుకుంటున్నారు. ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌కుండా లాక్ డౌన్ విధించ‌డం జ‌ర‌గ‌దు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించండి. దేశంలో నాలుగు ద‌శ‌లో లాక్ డౌన్ ముగిసింది. ప్ర‌స్తుతం అన్ లాక్ 1.0 న‌డుస్తోంది. అన్ లాక్ 2.0 గురించి మ‌న‌మంతా చ‌ర్చించుకోవాలి అని ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎంతో స్ప‌ష్టం చేశారు.