ఆ హీరోయిన్ కి భయపడ్డ మోడీ… జగన్ కి ఎసరు.

Modi Focus On Social Media Because of Ramya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజకీయాల్లో ఎక్కడ ఏ స్విచ్ వేస్తే ఏ బల్బ్ వెలుగుతుందో, ఇంకే బల్బ్ మాడిపోతుందో ఊహించడం కష్టం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కాస్త దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరికైనా టీడీపీ కి సెగ పెట్టి వైసీపీ తో అంటకాగడానికి బీజేపీ రెడీ అవుతున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఓ మాట చూస్తే మోడీ కి వాళ్ళు, వీళ్ళు అని లేదు స్వలాభం కోసం ఎవరినైనా ఇబ్బంది పెడతారని అర్ధం అవుతుంది. ఓ హీరోయిన్ ని చూసి భయపడ్డ మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జగన్ వ్యూహాలకు గండి కొడుతోంది. వినటానికి చిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజం అని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా …

2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఘన విజయానికి దారి తీసిన కారణాల్లో సోషల్ మీడియా ప్రభావం ముఖ్యమైనది. బీజేపీ కి అప్పుడు సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు వహించింది ప్రశాంత్ కిషోర్. అయితే ఆ తరువాత బీజేపీ తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న కారణంగా ప్రశాంత్ కిషోర్ మోడీ వ్యతిరేకులతో కలిసి పనిచేయడం మొదలెట్టాడు. బీహార్ లో లాలూ, నితీష్ ని ఒక్క తాటి మీదకు తెచ్చి బీజేపీ ని అక్కడ నిలవరించడంతో పీకే ప్రభ వెలిగిపోయింది. దీంతో కాంగ్రెస్ కన్ను పీకే మీద పడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకున్నా ఆ పార్టీ పగలపొడిచింది ఏమీ లేదు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ పిలుపుతో ఆంధ్రాలో ఆ పార్టీ తరపున ఎన్నికల వ్యూహ రచనలో పీకే ప్రస్తుతం పనిచేస్తున్నారు.

ఓ వైపు ఇదంతా జరుగుతున్నప్పుడు కిందటి ఎన్నికల్లో సోషల్ మీడియా విభాగంలో నిర్లక్ష్యం తమ కొంప ముంచిందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యవస్థను గాడిలో పెట్టే పనిని కర్ణాటక మాజీ ఎంపీ, సినీ నటి రమ్యకు అప్పగించారు రాహుల్ గాంధీ. అప్పటి నుంచి రమ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఐటీ, సోషల్ మీడియా విభాగపు పనితీరు బాగా మెరుగుపడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మోడీ వ్యతిరేక వాతావరణం ఏర్పడ్డంలో రమ్య చేసిన కృషి వుంది. రాహుల్ ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా మోడీకి పోటీ ఇవ్వలగలుగుతారు అని ఓ అభిప్రాయం కలగజేయడంలోరమ్య ప్రయత్నం ఫలించింది. దీంతో ఏ సోషల్ మీడియా అయితే 2014 లో తన విజయానికి దోహదపడిందో, అదే సోషల్ మీడియా 2019 లో తన ఓటమికి కారణం అవుతుందన్న భయం మోడీలో కలిగింది. ప్రత్యేకంగా రమ్య పనితీరుతో మోడీ డిఫెన్స్ లో పడ్డారు. ఆమెని సమర్ధంగా ఎదుర్కొని మళ్ళీ మోడీ అనుకూల గళాన్ని సోషల్ మీడియాలో వినిపించడంతో పాటు ఎన్నికల వ్యూహ రచనకు ప్రశాంత్ కిషోర్ సేవలు అవసరం అని మోడీ డిసైడ్ అయ్యారట. అనుకున్నదే తడవుగా పీకే ని పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే తాను వచ్చే ఎన్నికల దాకా వైసీపీ కోసం పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు పీకే చెప్పినా వినకుండా త్వరలో బీజేపీ కోసం పని మొదలు పెట్టాలని ప్రశాంత్ ని ఆదేశించారట మోడీ. ఇదే విషయం జగన్ కి చెప్పి పీకే మూటాముల్లె సర్దుకుని కమలదళం సేవకు వెళ్లే పనుల్లో వున్నాడట. ఆ విధంగా ఆ హీరోయిన్ ని చూసి మోడీ భయపడడంతో జగన్ కి ఎసరు వచ్చింది. కాదంటారా !.