Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అద్వానీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు…ఈ జాబితాలో ఏ ఒక్క పేరు విన్నా ప్రధాని మోడీ మోహంలో రంగులు మారిపోతున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ రాజకీయాలను ఏ మాత్రం దగ్గర నుంచి చూస్తున్నా ఇది అర్ధం అవుతుంది. ఈ ముగ్గురిని అంతటి శత్రుభావంతో చూస్తున్న మోడీ నిజానికి వారికి మేలు చేస్తున్నారు. రాజకీయ సమీకరణాలు ఎంత డైనమిక్ గా వుంటాయో అర్ధం చేసుకోకుండా ఆ ముగ్గురిపై పగ తీర్చుకుంటున్నానని భావిస్తూ వారి భవిష్యత్ కి మోడీ బంగారు బాటలు వేస్తున్నారు. అదెలాగా అనే కదా మీ డౌట్.
అడ్వాణీకి పీఎం పీఠం ఎక్కడం తీరని కోరిక అయిపోయింది. వయసు కూడా మీద పడడంతో ఇక అది జరిగే పని కాదని అద్వానీ కూడా డిసైడ్ అయిపోయారు. మోడీ ప్రభ ముందు అద్వానీ నిలవలేకపోయారు. అయితే అదంతా గతం అయ్యే సందర్భం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు చూసాక మోడీ ప్రాభవం తగ్గుతోందని అర్ధం అవుతోంది. అందుకే ఇన్నాళ్లు మౌనంగా మోడీ ఒంటెత్తు పోకడలు భరించిన nda పక్షాలు ఒక్కొక్కటిగా ఆయన మీద నిరసన గళం వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కి ఈ పక్షాలతో అవసరం పడొచ్చు. అప్పుడు ఆ పక్షాలు తప్పకుండా పెట్టే మొదటి షరతు మోడీ కాకుండా అద్వానీ పీఎం అయితే ఆలోచిస్తాం అని. ఆ విధంగా చూసినప్పుడు ఇది అద్వానీ ప్రయత్నం వల్ల కాకుండా మోడీ చర్యల ఫలితం అనుకోవాల్సివుంటుంది. అది అద్వానీ కి మోడీ ఇచ్చిన పరోక్ష గిఫ్ట్.
ఇక రాహుల్ గాంధీ కి ప్రధాని అయ్యే అర్హత ,సమర్ధత లేవని దేశ ప్రజలు భావించడం వల్లే 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం వచ్చింది. అయితే ఈ నాలుగేళ్ళ పాలనలో మోడీ కన్నా కాంగ్రెస్ బెటర్ అని జనం అనుకునే పరిస్థితి వచ్చింది. మోడీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడమే కాదు. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు బెడిసి కొట్టాయి. GST మీద వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట పప్పు అనుకున్న రాహుల్ గాంధీలో ఇప్పుడు జనం రక్షకుడుని చూస్తున్నారు. ఆ విధంగా మోడీ వైఫల్యమే ఇప్పుడు రాహుల్ కి గిఫ్ట్ గా మారింది.
ఇక చంద్రబాబు ఏది జరిగినా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అనుకున్నారు. సంకీర్ణ రాజకీయాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ లాంటి జాతీయ పార్టీల అండ లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం ఎంత కష్టమో ఆయనకు అర్ధం అయ్యింది. అందుకే ఏపీ కే పరిమితం అయ్యారు. కానీ 2019 ఎన్నికల తర్వాత మోడీ చేతుల్లో జరిగిన అవమానాలు , పరాభవాలు చంద్రబాబు ఆలోచనని మార్చడమే కాదు ఆయనలో ప్రత్యామ్న్యాయం చూడగలిగే పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు కల్పించారు మోడీ. తప్పని సరి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి కల్పించి చంద్రబాబుకు మోడీ గిఫ్ట్ ఇచ్చారు. కాదంటారా ?