Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్థిక శాఖ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్న మోడీ.. కీలకమైన రక్షణ శాఖను మొదట్నుంచీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అదేమంటే సంప్రదాయ యుద్ధాల కంటే ఆర్థిక యుద్ధాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నది నవీన సమాజ లక్షణమని బీజేపీ అనుకూలురు సమర్థించుకుంటున్నారు.
కానీ ఇప్పుడు సరిహద్దుల్లో ఉధ్రిక్తతలు పెరిగాయి. అటు పాక్, ఇటు చైనా రెండు పక్కలో బల్లేలుగా తయారయ్యారు. చైనా నాలుగైదు చోట్ల చొరబాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇంకా కీలక శాఖ రక్షణకు ఇన్ ఛార్జ్ మంత్రి పాలనే సాగుతోంది. బీజేపీలో ఎంతోమంది సమర్థులున్నప్పుడు ఎవరో ఒకరికి ఈ బాధ్యత అప్పగించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఇప్పటిదాకా మోడీని రక్షణ ఫుల్ టైమ్ విషయంలో ప్రత్యర్థులే విమర్శించేవాళ్లు. కానీ ఇప్పుడు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూడా మండిపడుతున్నారు. మోడీ ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని ఆయన హెచ్చరించారు. గోవా ఉపఎన్నికల్లో గెలిస్తే సీఎంగా ఉంటా.. లేదంటే రక్షణ మంత్రిగా వెళ్లిపోతా అని గోవా సీఎం పారికర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయన కోసం సీటు రిజర్వ్ చేశారా అని మండిపడుతున్నారు థాక్రే.