అమరావతి పుననిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద అమరావతి పున:ప్రారంభంకానుంది. ప్రధాని సభావేదిక వద్దకు వెళ్లే సమయంలో… ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం, మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటో మొబైల్ స్క్రాప్‌తో తయారుచేసిన మోదీ విగ్రహం… స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్ సింబల్స్‌ని ఐరన్ స్క్రాప్‌తోనే తయారు చేసి ఉంచారు.






