తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతుండడంతో బీజేపీ ఎలా అయినా కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న కొంచెం వ్యతిరేకత వాడుకుని గెలవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదో ఒక కారణంతో కేంద్రం నుండి మోదీ లేదా అమిత్ షా లేదా నడ్డా లు వస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని కాసేపటి క్రితమే తెలిసింది.
అక్టోబర్ 3 వ తేదీన నిజామాబాద్ లో ప్రధాని షెడ్యూల్ ప్రకారం ప్రత్యక్షం కానున్నారు. కాగా ఈ పర్యటనలో మోదీ ప్రోగ్రామ్స్ చూస్తే… మధ్యాహ్నం 2.55 గా గంటలకు నిజామాబాద్ కు చేరుకుంటారు, అక్కడ జరగనున్న పలు ప్రారంభోత్సవాలలో మధ్యాహ్నం 3.35 గంటల వరకు గడపనున్నారు.ఆ తర్వాత 3.45 గంటలకు నిజామాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలో తెలంగాణను ఉద్దేశించి కీలక విషయాలను గురించి ప్రస్తావిస్తారు… అనంతరం 5 గంటలకు తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు.