చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్-2022 ముందు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మోయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్స్‌ర్లు అలీ బాదాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్, మోయిన్ అలీ, విన్స్ పరుగులతో రాణించారు.
విండీస్ బౌలరల్లో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. విండీస్ బ్యాటర్లలో కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్ పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్, లివింగ్‌స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు రెండు విజయాలతో సమంగా నిలిచాయి. కాగా వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య ఐదో టీ20 ఆదివారం జరగనుంది. ఇక చెన్నైసూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు మోయిన్ అలీను రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.