Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంచు మనోజ్ తన కొత్త సినిమాను విభిన్నంగా ప్రకటించాలనే ఉద్దేశ్యంతో నేడు ఉదయాన్నే తాను సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అంతా కూడా అవాకయ్యారు. మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో పాటు జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. దాంతో కొద్ది సమయానికే మంచు మనోజ్ ఆ పోస్ట్‌ను తొలగించడం జరిగింది. ఆ పోస్ట్ తొలగించడంకు ముందు మనోజ్‌తో మోహన్‌బాబు కాస్త సీరియస్‌గా మాట్లాడినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
మోహన్‌బాబు స్వయంగా మనోజ్‌ను పిలిపించి తిక్కతిక్క వేషాలు వేయమాకు, సినిమాలకు గుడ్ బై చెబుతున్నా అంటూ పోస్ట్ చేశావు ఏంటి అంటూ ప్రశ్నించాడట. అందుకు కొత్త సినిమా అనౌన్స్ చేసేందుకు పబ్లిసిటీ కోసం అలా చేశాను అంటూ మనోజ్ చెప్పినా కూడా మోహన్‌బాబు వినిపించుకోకుండా తిడుతూనే ఉన్నాడట. దాంతో అక్కడిక్కడ మనోజ్ ఆ ట్వీట్ మరియు ఫేస్బుక్ పోస్ట్‌ను తొలగించాడట. ఆ తర్వాత కొద్ది సమయానికి వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో మనోజ్ జనాలను ఫూల్స్‌ను చేయాలని చూశాడు. అనుకున్నట్లుగానే ఫూల్స్‌ను చేశాడు. దాంతో పాటు ఆయన కూడా ఫూల్ అయ్యాడు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.