Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించి, విలన్‌గా నటించి, సినిమాలను నిర్మించి టాలీవుడ్లో తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మిలు తెరంగేట్రం చేశారు. అంతా బాగానే ఉంది. అయితే మోహన్‌బాబు మీడియా ముందుకు వస్తే ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను అంటూనే కొందరిని టార్గెట్ చేస్తూ పదే పదే విమర్శలు చేస్తూ మోహన్‌బాబు చిరాకు కలిగిస్తాడు.
తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన మోహన్‌బాబు మరోసారి కొంతమంది హీరోలను టార్గెట్ చేసి విమర్శలు చేశాడు. తాను వచ్చిన కొన్నాళ్లుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు నాపై కుట్ర పన్నారు. వారు నాగురించి తప్పుడు ప్రచారం చేసి నా ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా నా కెరీర్‌ను నాశనం చేయడం వారి వల్ల కాలేదు అంటూ మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. ఆ మద్య రాజకీయ నాయకులను తీవ్ర స్థాయిలో ఆడిపోసుకున్న మోహన్‌బాబు ఇప్పుడు తనతోటి హీరోలపై విమర్శలు చేయడం ఆయన సంస్కారంకు తగదు అని సోషల్ మీడియాలో జనాలు సలహా ఇస్తున్నారు. ఇతరులను విమర్శించినంత మాత్రాన మనం గొప్ప వాళ్లం అయిపోము, ఇతరులను గౌరవిస్తూ మాట్లాడినప్పుడే గొప్పవాళ్లం అవుతాం. ఈ విషయాన్ని మోహన్‌బాబు తెలిసికోవాలని కొందరు సూచిస్తున్నారు.