వెయ్యి కోట్లది షురూ కాకుండానే 600 కోట్ల మరో ప్రాజెక్ట్‌

Mohanlal Fantasy Film Is A Missed Opportunity

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mohanlal To Do Odeon Movie With 600 crores Budget

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా సత్తా చాటుతున్నాడు. తెలుగులో గత సంవత్సరం వరుసగా పలు సక్సెస్‌లు అందుకున్న మోహన్‌లాల్‌ తమిళంలో కూడా మంచి ఫాంలో ఉన్నాడు. ఇక సొంత భాషలో ఆయన ఎవర్‌ గ్రీన్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్‌లాల్‌తో అందుకే ఒక ప్రముఖ వ్యాపారవేత్త 1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం చిత్రాన్ని నిర్మించాలని భావించాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ ఇంకా షురు కాకుండానే ఒక భారీ ఫాంటసీ చిత్రాన్ని మోహన్‌లాల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

600 కోట్ల బడ్జెట్‌తో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ఫిల్మ్‌ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఒక మంచి సోషియో ఫాంటసీ కథను ఇప్పటికే సిద్దం చేశారని, గ్రాఫిక్స్‌తో పాటు, అద్బుతమైన లొకేషన్స్‌ మరియు సెట్టింగ్స్‌కు భారీగా ఖర్చు అవుతుంది. అందుకే నిర్మాత 600 కోట్లు పెట్టి కూడా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 600 కోట్ల సినిమాకు టైటిల్‌తో ‘ఓడియన్‌’ ను ఫిక్స్‌ చేశారు. తెలుగు మరియు ఇతర భాషల్లో త్వరలోనే టైటిల్స్‌ను ప్రకటిస్తారు. వచ్చే సంవత్సరంలో సినిమా వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

విశాల్‌ ఎంత సాహసం చేశాడో తెలుసా?

వర్మ దర్శకత్వంలో బాలయ్య…ఎన్టీఆర్ బయోపిక్