వర్మ దర్శకత్వంలో బాలయ్య…ఎన్టీఆర్ బయోపిక్

ram gopal varma to direct NTR biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ బయోపిక్ కి డైరెక్టర్ ఎవరో దాదాపు తెలిపోయిందట. ఈ అవకాశాన్ని రామ్ గోపాల్ వర్మ కి ఇవ్వడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఈ వ్యవహారంలో పైసా వసూల్ డైరెక్ట్ చేస్తున్న పూరి జగన్నాధ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. సినిమాల పరంగా చూస్తే వర్మ, బాలయ్య భిన్న ధృవాలు. ఒకరు పక్కా మాస్ సినిమాలు చేస్తే, ఇంకోరిది ప్రయోగాల దారి. ఈ ఇద్దరి కాంబినేషన్ జరుగుతుందని చిత్రసీమలో కనీసం ఓ పుకారు కూడా ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు బాలయ్య కన్ను ఎన్టీఆర్ బయోపిక్ మీద పడటంతో ఆ తరహా సినిమాలు తీయడంలో ఎక్స్ పెర్ట్ అయిన వర్మ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి .

నిజానికి వర్మ, బాలయ్య మధ్య అంతకు ముందు పెద్దగా సంబంధాలు కూడా వుండేవికావట. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి టైం లో ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వర్మ చేసిన కామెంట్స్ బాలయ్య దృష్టిలో పడకపోలేదు. ఆ తర్వాత రైతు సినిమాలో ఓ పాత్ర చేయమని అమితాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్కార్ సెట్ లో వర్మ ని కూడా కలిసాడు బాలయ్య. ఆయన పనితీరుని గమనిస్తూ సెట్ లో కూర్చున్న ఫోటోలు అప్పట్లో ఓ సంచలనం.

పైసా వసూల్ షూటింగ్ టైం లో పూరి తో బాలయ్య ఎన్టీఆర్ సినిమా గురించి ప్రస్తావించినప్పుడు ఈ తరహా సినిమాల్ని వర్మ బాగా డీల్ చేస్తాడని అతన్ని కన్విన్స్ చేసాడంట. బాలయ్య కాస్త మెత్తపడటంతో వర్మని కూడా ముందుకు నెట్టాడట. ఇప్పుడు మొత్తానికి ఇద్దరూ ఒకరితోఒకరు సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారట. అంత పని చేసింది ఎన్టీఆర్ అని ఒప్పుకోవాల్సిందే. ఆయన బయోపిక్ కాకుంటే ఈ కాంబినేషన్ సెట్ అయ్యేది కాదంట. ఇక ఈ సినిమాకి నిర్మాతగా వినిపిస్తున్న పేరు విష్ణు. ఇతను ఒకప్పుడు సినిమా తారలతో క్రికెట్ ఆడించిన Ccl నిర్వాహకుడు .

 మరిన్ని వార్తలు 

పవన్‌ ఫ్యాన్స్‌ ‘డీజే’ను పైరసీ చేశారంటూ ఆరోపణలు