విశాల్‌ ఎంత సాహసం చేశాడో తెలుసా?

vishal Courageous Statement About Kaveri River Disputes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

vishal Courageous Statement About Kaveri River Disputes

తమిళ హీరోల్లో విశాల్‌ ఈ మద్య ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. సినిమాలతో పాటు నడిగర్‌ సంఘం కార్యక్రమాలు, నిర్మాతల మండలి ఎన్నికలు ఇంకా రైతుల సమస్యలపై పోరాడటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఇలా పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం వల్ల విశాల్‌ మీడియాలో ఎక్కువగా ఉంటున్నాడు. విశాల్‌ చేస్తున్న కొన్ని సాహసమైన పనుల వల్ల రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో విశాల్‌ ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా పర్యటించడం జరిగింది. ఆ సందర్బంగా కావేరీ జలాల గురించి మాట్లాడాడు.

తమిళులకు, కన్నడ ప్రజలకు కావేరీ జలాల విషయంలో పెను వివాదం నడుస్తుంది. తమిళుల తీరుకు కర్ణాటక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు కూడా కావేరీ జలాలకు సంబంధించి మాట్లాడినా వారి సినిమాలు అక్కడ ఆడకుండా కర్ణాటక ప్రజలు ఆందోళనలు చేస్తుంటారు. అలాంటిది కర్ణాటకలోనే అదీ బెంగళూరులో కావేరీ జలాలపై తమకు హక్కు వుంది, హక్కుల కోసం పోరాటం చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులోనే కావేరీ జలాల గురించి మాట్లాడేందుకు సినీ తారలు ఒణికి పోతున్న సమయంలో ఏకంగా కర్ణాటకలోనే విశాల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం కాస్త ఉత్కంఠ పరిస్థితులకు దారి తీసింది.

మరిన్ని వార్తలు:

పవన్‌ ఫ్యాన్స్‌ ‘డీజే’ను పైరసీ చేశారంటూ ఆరోపణలు