‘కన్నప్ప’లో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Mohanlal's first look in 'Kannappa' is out
Mohanlal's first look in 'Kannappa' is out

గ‌త వారం రోజులుగా మంచు ఫ్యామిలీ కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. అయితే, తాజాగా మంచు కుటుంబం నుంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘క‌న్న‌ప్ప’ నుంచి కీల‌క అప్‌డేట్ అయితే వ‌చ్చింది. ఇందులో న‌టిస్తున్న మోహ‌న్ లాల్ పాత్ర తాలూకు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఇక మైథలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న మూవీ ని దాదాపు రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో మంచు మోహ‌న్ బాబు నిర్మిస్తున్నారు. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ మూవీ కు ముఖేశ్‌కుమార్‌ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 Mohanlal's first look in 'Kannappa' is out
Mohanlal’s first look in ‘Kannappa’ is out

ఈ సినిమా లో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణులతో పాటు ఇత‌ర కీల‌క‌ తారాగ‌ణం ఫ‌స్ట్ లుక్‌ల‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఇప్పుడు మలయాళం స్టార్ న‌టుడు మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా లో ఆయ‌న‌ ‘కిరాట’ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో క‌నిపించ‌బోతున్నట్టు మేక‌ర్స్ తెలిపారు. ఇక తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో చూడ‌టానికి ఆయన చాలా గంభీరంగా క‌నిపిస్తున్నారు.