నందమూరి నటసింహం బాలయ్య హీరోగా ఇపుడు డాకు మహారాజ్ అనే సాలిడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ తో పాటుగా బాలయ్య తన ఓటిటి షోలో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ బిజీ లోనే బాలయ్య తన వారసుణ్ణి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం నందమూరి ఫ్యాన్స్ ను ఒక రేంజ్ లో ఎగ్జైట్ చేసింది.
కానీ రీసెంట్ గానే ఈ మూవీ ఆగిపోయింది అంటూ పలు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనితో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆగిపోయినట్టేనా అని నందమూరి ఫ్యాన్స్ కూడా కొంత బాధ పడ్డారు. అయితే ఇపుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అసలు క్లారిటీ వినిపిస్తుంది. వీరి కలయికలో సినిమా ఆగిపోలేదట. జస్ట్ ముహూర్తం వాయిదా పడినట్టుగా మాకు సమాచారం. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పాలి. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ మోక్షజ్ఞ్యను సాలిడ్ లెవెల్లో సిద్ధం చేస్తున్నాడు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు.