ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు ఇద్దరు లైంగిక దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాదితురాలి తల్లి కూలి పనులకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాలిక ఇంటి బయట ఆడుకుంటుంది. ఇది గమనించిన బాలురు.. ఎవరూ లేని సమయంలో చూసి బాలికను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లారు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక ఇంటికి వచ్చిన తల్లితో జరిగిన దారుణాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి తన కూతురుపై జరిగిన ఘోరాన్ని గ్రామస్థులకు తెలియజేసింది.
దీంతో ఆగ్రహించిన స్థానికులు ఇరువురు బాలురకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీఐ ఉపేందర్, ఎస్సై మధుప్రసాద్ ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.