ఆడవారిపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలని కూడా చూడకుండా కొందరు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ మూడేళ్ల చిన్నారిపై వరసకు బాబాయ్ అయ్యే వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.తుర్కపల్లి మండలంలోని పెద్దతండాలో ఈ ఘటన జరిగింది.
పెద్ద తండాకు చెందిన మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు పని మీద బయటికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో ఆడుకుంటోంది. వరుసకు బాబాయ్ అయ్యే నవీన్ ఆ పాపకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర కడుపు నొప్పితో ఇంట్లో ఏడుస్తూ ఉంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. ఆ చిన్నారి ఎందుకు ఏడుస్తుందో అర్థంకాక ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. జులాయిగా తిరిగే నవీనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నవీన్ ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడని.. గంజాయి కూడా తీసుకుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం నవీన్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.