మైనర్‌ బాలికపై అత్యాచారం

మైనర్‌ బాలికపై అత్యాచారం

పట్టణంలోని కల్యాణ్‌ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్‌ బాలికపై 21 ఏళ్ల వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో మైనర్‌ బాలిక ఇంటిపక్కనే ఉన్న 21 ఏళ్ల వ్యక్తి బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక గర్భవతి అయింది.

దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఓ శిశువుకి జన్మనిచ్చింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు బిహార్‌ పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.