హైదరాబాద్‌కి మకాం మార్చిన బిగ్‌బాస్‌ భామ

హైదరాబాద్‌కి మకాం మార్చిన బిగ్‌బాస్‌ భామ

మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మ‌ధ్య రిలేష‌న్ వీక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.

బిగ్‌బాస్‌లో పాల్గొన‌క‌ముందు ఈ భామ ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చింది. ఇక హౌస్‌ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇక తన ఫ్యాన్స్‌తో టచ్‌లోకి ఉండేందుకు సోషల్‌ మీడియాలోకి వచ్చిన ఈ గుజరాతీ భామ.. తరచుగా హాట్‌ హాట్‌ ఫోటోలు, వీడియోలు వదులుతూ హల్‌ చల్‌ చేస్తుంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది.

వరుస ఆఫర్లు రావడంతో తన మకాంని హైదరాబాద్‌కి మార్చాలని భావించిందట ఈ ముద్దుగుమ్మ. ఇందుగో ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో ప్రత్యేక్షమైంది మోనాల్‌. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా​స్టోరీలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ పోస్ట్‌ చేసింది.