చిన్న చిన్న అనారోగ్య సమస్యలని నెగ్లెక్ట్ చేస్తే దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కళ్ళు తిరగడం గురించి కొన్ని విషయాలు ఆరోగ్య నిపుణులు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం. ఆలస్యమెందుకు పూర్తిగా ఇప్పుడే చూసేయండి.చాలా మందిలో కళ్లు తిరిగే సమస్య ఉంటుంది. అయితే ఇది నిజంగా ప్రమాదమా..?, దీని వలన కలిగే నష్టాలు ఏంటి..? ఇలా చాలా విషయాలు ఇక్కడ వున్నాయి. వాటి కోసం కూడా తప్పక తెలుసుకోండి. ఒత్తిడి, నీరసం ఇలా వివిధ కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.
దీనిని లైట్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలా మంది అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఎలాంటి లక్షణాలు వస్తాయి ఇలా ఎన్నో విశేషాలు మనతో పంచుకున్నారు నిపుణులు. ఇక మనం అసలు విషయంలోకి వెళ్తే…కళ్లు తిరిగి పడిపోవడానికి లక్షణాలు ….తలనొప్పి,అలసట ,తిన్నాక మరియు వ్యాయామం చేశాక కళ్ళు తిరగడం,బలహీనంగా అనిపించడం,కంటి చూపులో మార్పు
ఇలా ఇటువంటి లక్షణాలు చూడొచ్చు అని అన్నారు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం కళ్ళు తిరగడం అనేది transient loss of consciousness (TLOC)తో మొదలవుతుందని … ఆ తర్వాత పేషెంట్ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ చూస్తారని అన్నారు. ఎప్పుడైనా ఈ సమస్య వస్తే మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటే అప్పుడు తప్పకుండా కార్డియాక్ ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
హార్ట్‌బీట్ సరిగ్గా లేకపోవడం అంటే కొన్ని కొన్ని సార్లు హార్ట్ బీట్ కొన్ని సెకన్ల పాటు ఆగిపోతుంది. దీంతో బ్లడ్ ఫ్లో టెంపరరీగా బ్రెయిన్‌కి వెళ్లదు. దీని కారణంగా syncope వస్తుంది.హఠాత్తుగా బ్లడ్ ప్రెషర్లో మార్పు కనపడడం వలన బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గుతుంది.కొంతమంది డాక్టర్స్ syncope సాధారణంగా స్ట్రోక్‌కి కారణం కాదు అని అన్నారు. కానీ స్ట్రోక్‌కి ఒక సబ్ టైప్ అని అన్నారు. బ్రెయిన్ వెనుక భాగాన్ని ఇది డేమేజ్ చేసి స్టెబిలిటీని పోగొడుతుంది. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్తో కొట్టుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది.అయితే దీనిలో రెండు కండిషన్స్ ఉన్నాయి.
ఒకటి గుండె వేగంగా కొట్టుకోవడం. రెండోది గుండె నెమ్మదిగా కొట్టుకోవడం. ఆ తర్వాత బ్లడ్ పంపింగ్‌ని ఆపేస్తుంది. దీని కారణంగా బ్రెయిన్లో బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలా syncope సమస్య వస్తుంది.డాక్టర్లు దీని నుంచి ఎలా బయట పడవచ్చు అనేది కూడా చెప్పారు. వాటి కోసం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం.అన్నిటి కంటే ముఖ్యమైనది ఆరోగ్యం అని మనం చెప్పుకున్నాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవన విధానాన్ని పాటించాలి.
దానితో పాటుగా సరైన మెడికేషన్, సరైన ట్రీట్మెంట్ అవసరం. మనకి ఉండే సమస్యని బట్టి తగిన ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. కొంత మంది చిన్న సమస్యే కదా అదే పోతుందిలే అని వదిలేస్తారు.మరి కొందరు సమస్య చిన్నదైనా ఎక్కువ మందులు వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదకరమే. అవసరాన్ని బట్టి సివియరిటీని బట్టి సరైన మెడికేషన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి.
అనారోగ్య సమస్యలని కనుక తగ్గించుకోవాలంటే ప్రతి రోజు ఈ చిన్న చిన్న వాటిని జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. వాటి కోసం కూడా ఇప్పుడు తెలుసుకోండి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.ఈ సమస్య నుండి బయట పడాలంటే ప్రతిరోజు రెగ్యులర్‌గా మీల్స్‌ని తీసుకోండి. రోజులో ఏ మీల్స్‌ని స్కిప్ చేయొద్దు.అలాగే తగినంత నీళ్ళు తీసుకోవడం ముఖ్యం. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళు త్రాగడం చాలా అవసరం. మంచి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
నీళ్లు తాగకపోతే ఏమవుతుందిలే అని అశ్రద్ధ చేయకండి. మంచి నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.అదే విధంగా మీరు ఎప్పుడూ కూడా ఒకే దగ్గర నిల్చుని ఉండిపోకండి. మీరు మీ కాళ్ళని కదపండి కాసేపు వాక్ చేయండి లేదా చిన్న చిన్న స్ట్రెచెస్ లాంటివి చేయండి.ఎక్కువగా కళ్లు తిరిగేవాళ్ళు వేడిగా ఉండేచోట ఉండొద్దు. మంచిగా మీ పట్ల శ్రద్ధ తీసుకోండి.అదే విధంగా డయాబెటిస్ లేదా కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఉంటే మంచి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడండి.
ఒక వేళ కనుక ఈ మందులు తీసుకోవడం వల్ల మీకు కాస్త తల తిరుగుతున్నట్టు కానీ లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కొన్ని కొన్ని సార్లు మందుల వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా ఈ సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి చెక్ చేసుకోండి.
బ్లడ్ ప్రెషర్ లాంటివి రెగ్యులేట్ చేసుకోవడానికి సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేట్‌గా ఉండటం లాంటివి పాటించండి. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. టిప్స్ చాలా చిన్నవి మరియు పాటించడానికి కూడా చాలా సులభం. రెగ్యులర్ గా ఈ టిప్స్‌ని కనుక పాటించారు అంటే తప్పకుండా ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధ పడే వాళ్ళు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి ఆరోగ్యంగా జీవించండి.