వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వంభార్య దుర్గ. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత 9న అన్నామలై, గోపాలకృష్ణన్కొడుకును తీసుకెళ్లి హత్య చేశారు.
సూర్య తాత ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో కొడుకు సూర్య తల్లిదుర్గకు, గోపాలకృష్ణన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దుర్గ, గోపాలకృష్ణన్ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య చూశాడనే కారణంతోనే హత్య చేసినట్లు వెల్లడైంది.