తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ పెద్ద లేడన్న బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.