కడప నగరంలో ఓ తల్లీ, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో నివాసం ఉంటున్న తల్లి శ్రావణి(34) తన తొమ్మిదేళ్ల కూతురు శాన్వితో కలిసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
శ్రావణి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారని, ఆమెకు పదేళ్ల క్రితం వివాహం అయిందని పోలీసులు తెలిపారు. ఇక శ్రావణి నాలుగేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటూ కూతురు శాన్వితో ఉంటుంన్నారని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా తల్లి, కూతురు ఆత్మహత్య కలకలం రేపుతోంది.