కరోనా వెటుకు తల్లి బలి… కుమారుడే ఇలా చేశాడు

దేశమంతా కరోనా హడలెత్తిస్తుంది. కరోనా వైరస్ ప్రాణాల్నే కాదు.. మానవ సంబంధాల్ని.. అనుబంధాల్ని కూడా తుడిచి వేస్తుంది. తాజాగా పంజాబ్‌ లో చోటు చేసుకున్న ఘటనే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నవమాసాలు కనిపెంచిన ఓ తల్లి దురదృష్ట వశాత్తు కరోనాతో మృతి చెందింది. కానీ.. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి కన్న కొడుకు కూడా తల్లి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు రాలేదు.

కాగా ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో చోటు చేసుకుంది. షిమ్లాపురి గ్రామానికి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని వైద్యులు చెప్పారు. తర్వాత మరణించింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాలని జిల్లా అధికారులు ఆమె కుమారుడిని కోరారు. అయితే ఆమె శవాన్ని తీసుకెళ్లేందుకు కుమారుడు కానీ.. బంధువులు కానీ ఎవరూ రాలేదు. దీంతో షాక్ కు గురికావడం అధికారుల వంతు అయింది. ఇక చేసేది లేక అధికారులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో మృతురాలి కుమారుడు, బంధువులు 100మీటర్లు దూరం నుంచి అంత్యక్రియలను చూడటం కొసమెరుపు.