కొడుకుని కొట్టి చంపిన తల్లి

కొడుకుని కొట్టి చంపిన తల్లి

తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుకి దెయ్యం ప‌ట్టింద‌ని ఓ తల్లి కొట్టి చంపిన సంఘటన అర‌ణిలో వెలుగు చూసింది. వివారలు.. తన 7ఏళ్ల బాలుడికి కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లి ఓ స్వామీజీని కలిసింది. కొడుక్కి దెయ్యం ప‌ట్టింద‌ని స్వామీజీ చెప్పడంతో, పిల్లవాడి పల్ల తల్లి అత్యంత దారుణంగా ప్రవర్తించింది. తన కొడుకును దెయ్యం ఆవహించిందని మూడు రోజులుగా కొడుతూనే ఉన్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కలిసి బాలుడిపై అత్యంత రాక్షంగా వ్యవహరించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే చిత్రహింసలతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లితో స‌హా ముగ్గురు మ‌హిళ‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దెయ్యం ఆత్మను వదిలించేందుకు తన కుమారుడిని కొట్టినట్లు బాలుడి తల్లి అంటున్నారు. అయితే నిందితురాలు తల్లి మానసిక పరిస్థితి సరిగాలేదని, ఆస్పత్రిలో వైద్యం అందించి తర్వాత రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.