నవ మాసాలు మోసి జన్మనించిన శిశువుని కన్న తల్లే అమ్మాకానికి పెట్టిన ఘటన నెరేడ్మెట్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. హత్యాచారం కేసులో బాధితురాలైన ఓ మహిళ ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఈనెల 12వ తేదీన ప్రసవం కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చిన బాధితురాలికి 10 రోజుల క్రితం పండంటి ఆడపిల్ల జన్మించింది.
ఏ కష్టం వచ్చిందో ఏమో గానీ బాధితురాలు పుట్టిన పసికందును తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్కేసర్ మండలం ఎదులాబాద్కు చెందిన వారికి 60 వేల రూపాయలకు విక్రయించింది. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తీసుకు రావాలని నేరెడ్మెట్ పోలీసులు కోరగా.. పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా..పాపను విక్రయించినట్లు గుర్తించారు. పాపను సురక్షితంగా రక్షrించిన పోలీసులు శిశువును ఘట్కేసర్ ఎదిలాబాద్లోని చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.