పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన ఓ కన్నతల్లి తన కూతురినే ఓ తల్లి ట్రైన్‌లో నుంచి కిందకు తోసేసింది. పెద్దపల్లి మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
తీవ్రంగా గాయపడిన పాపను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పాపకు అంగవైకల్యం ఉండడం వద్ద తల్లి ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.