తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఆంధ్రప్రదేశ్cన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో విరగబడి నవ్వినటువంటి ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, ఎంపీ కేశినేని నాని, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆ వీడియో ని ఉద్దేశిస్తూ ఒక పోస్టు కూడా పెట్టారు. “పిచ్చి వాడి చేతిలో రాయి జగన్ చేతిలో రాజధాని రెండిటికీ ఏమీ తేడా లేదు.. ఎటు విసురుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు’ అని తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఇకపోతే సభలో అధికార పక్షం వారు ఎదుటి వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని, ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే… సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా విరగబడి నవ్వుతుండటాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇకపోతే టీడీపీ పాలనలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని, దానికితోడు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేశామని, కానీ ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలను రాచి రంపాన పెడుతుందని, సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు.