జనతాదళ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి.
ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు.