ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికారపక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పురంధేశ్వరి చురకలంటించారు. ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని.. అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు కోసం జగన్ మాట్లాడకపోవటం, హాజరు కోసం వెళ్ళటం సిగ్గుచేటు అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు.
