రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు.
సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా టీడీపీ పాలన కంటే వైఎస్సార్‌సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని స్పష్టం చేశారు.