విజయసాయిరెడ్డి దిశ చట్టం గురించి పలు విషయాలని వెల్లడించారు. సాక్ష్యాత్తు నరేంద్రమోడీ దిశ చట్టాన్ని ప్రశంసించారని అన్నారు. అయితే దిశ యాక్ట్ కాపీ ని పంపిస్తే తాము కూడా అనుసరిస్తామని ఒరిస్సా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు అభ్యర్ధించాయి అని తెలిపారు. అయితే చట్టం రూపొందించే చర్చలో పాల్గొనకుండా చంద్రబాబు ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శించారు అని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలకు కొందరు కామెంట్ల రూపంలో విజయసాయిరెడ్డి ని ప్రశ్నిస్తున్నారు.
చట్టం చేసాక ఆంధ్ర ప్రదేశ్ లో చాలానే ఘటనలు జరిగాయని, తిరుపతి, గుంటూరులో మాత్రమే కాకుండా ఇంకా చాల ఉన్నాయని, వాటి వివరాలైన తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం అయితే,ఇప్పటికి సుగాలి ప్రీతి గురించి న్యాయం చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన సంఘటనకి ఇక్కడ చట్టం చేస్తే, రాష్ట్రం నడిబొడ్డులో సుగాలి ప్రీతీ ఫై జరిగిన ఘటన కి ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నలు వేస్తున్నారు.