డిజిటల్ పార్ట్ నర్ ని ఫిక్స్ చేసుకున్న“మిస్టర్ బచ్చన్”..!

"Mr. Bachchan" fixed a digital partner..!
"Mr. Bachchan" fixed a digital partner..!

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రల లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. రిలీజైన ప్రచార మూవీ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

"Mr. Bachchan" fixed a digital partner..!
“Mr. Bachchan” fixed a digital partner..!

అయితే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.