టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి టాప్ మోస్ట్ హీరో అన్న సంగతి మనకి తెలిసిందే. ఇండస్ట్రీలోకి చాలా కష్టపడి పైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు . అయితే టాప్ హీరోగా ఉన్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు . అయితే కొన్ని అనూహ్య కారణాలవల్ల ఆయన తిరిగి మూవీ లు చేస్తున్నారు. రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ అదరగొడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 156 మూవీ లు చేసిన మెగాస్టార్ చిరంజీవి 157వ మూవీ కు కూడా సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి… ఇటీవల బోలా శంకర్ మూవీ తో మెరిశారు. అయితే వాల్తేరు వీరయ్య బంపర్ హిట్ సాధించినప్పటికీ బోలా శంకర్ మూవీ మాత్రం బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 157వ మూవీ బింబి సారా దర్శకుడు వశిష్టతో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కథ సిద్ధం కాగా…అలాగే షూటింగ్ కోసం కసరత్తు జరుగుతుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతోందట. ఇందులో భాగంగానే సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసినట్లు గా తెలుస్తోంది. చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ ను రంగం లోకి దించేందుకు ఇప్పటికే చిత్ర బృందం స్కెచ్ వేసిందట. ఈ ఆఫర్‌కు సీత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకి తెలుస్తోంది. ఇక దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.