భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి దూరం అయ్యి కెప్టెన్సీ పగ్గాలు వేరేవారికి అందించిన ఆదాయంలో మాత్రం మునుపటిలానే దూసుకెళ్తున్నాడు. ధోనీ తాజాగా రూ. 12.17 కోట్లు టాక్స్ కట్టినట్లు ఝార్కండ్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 2017-18 వార్షిక సంవత్సరానికి ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ పన్ను చెల్లించలేదని వివరించిన అధికారులు.. గత ఏడాదితో పోలిస్తే రూ.1.24 కోట్లు అధికంగా ధోనీ చెల్లించినట్లు తెలిపారు. 2015లో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న టాప్-100 అథ్లెట్స్ జాబితాలో నిలిచిన ధోనీ.. ఆ తర్వాత 2016 ఆరంభంలో భారత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గత ఏడాదంతా బీసీసీఐ నుంచి ఎ గ్రేడ్ స్థాయిలో వేతనాన్ని అందుకున్న ధోనీ.. ఈ ఏడాది బోర్డు కొత్తగా ఏ+ గ్రేడ్‌ను తీసుకొచ్చినా.. ఈ మాజీ కెప్టెన్ ఏ గ్రేడ్‌కే పరిమితమయ్యాడు.