ధోనీ బర్త్ డే వీక్ లో ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

MS Dhoni-The Untold Story movie ready to Sequel

ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ! అంటే ఈరోజు ధోనీ కొత్త రికార్డు సృష్టించాడు కదా దాని గురించి అనుకుంటున్నారా ? అయితే పప్పులో కాలేసినట్టే, అంతకు మించి ధోనీ అభిమానులకి పెద్ద వార్త ఇది. అదేంటంటే త్వరలో ‘ఎంఎస్‌ ధోనీ’ సీక్వెల్‌ రాబోతోంది. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవితాధారంగా… ‘ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ టైటిల్‌తో బయోపిక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన ఈ బయోపిక్‌ను నీరజ్‌ పాండే తెరకెక్కించారు. రీల్‌ లైఫ్‌ ధోనీగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించారు. ధోనీ పాత్రలో సుశాంత్‌ ఒదిగిపోయారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీయబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మొదటి విడతలో క్రికెటర్‌గా ధోనీ జీవితం, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలను చూపించారు. సీక్వెల్‌లో 2011 ప్రపంచ కప్‌ తర్వాత ధోనీ జీవితంలో ఏం జరిగింది? తదితర విషయాలను చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే సీక్వెల్‌లో ఎలాంటి అంశాలను జోడించాలి? అన్న విషయం ధోనీనే నిర్ణయించనున్నారట !