అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం

అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం

బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రాల తరువాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR… ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా రెండు ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇకపోతే అసలు విషయం ఏంటంటే… ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్, రాజమౌళి ఇప్పటికే స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.

కాగా ఈ చిత్ర నిర్మాతల విషయంలో ఒక తాజా సంచలనమైన వార్త ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రానికి మరొక నిర్మాత కూడా ఉన్నాడని సమాచారం. అయితే బాహుబలి సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించిన పీవీపీ కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. కాగా దర్శకుడు రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఆ నిర్మాత ఇలా ముందడుగు వేశాడని సమాచారం. కానీ ఈ విషయాలన్నీ కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.